హైదరాబాద్ లక్డీకపూల్‌లో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ లక్డీకపూల్‌లో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌ లక్డీకపూల్‌ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి యత్నించారు.పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులకు, ఉద్యోగులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.

Next Story