బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఇబ్బందులు

బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఇబ్బందులు


తెలంగాణ వ్యాప్తంగా బిల్లులు రాక డైట్‌ కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. DME, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్న డైట్‌ కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు. అప్పులు తెచ్చి కొందరు బంగారం కుదవపెట్టి మరికొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫుడ్‌ సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి 20 నుంచి 40 లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. బిల్లుల కోసం సెక్రటేరియట్‌ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story