సంఘ వ్యతిరేక శక్తులకు విశాఖ అడ్డా

సంఘ వ్యతిరేక శక్తులకు విశాఖ అడ్డా

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక శక్తులకు విశాఖ అడ్డాగా మారిందన్నారు. అమిత్ షా వచ్చి వెళ్లిన మూడ్రోజులకే విశాఖలో వైసీపీ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎంపీ ఇంట్లో మూడ్రోజులు తిష్టవేసిన కిడ్నాపర్లు గంజాయి, డ్రగ్స్ వాడారని తెలిపారు. కిడ్నాప్ ఘటనను కప్పిపుచ్చేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విశాఖ కిడ్నాప్‌ ఘటనపై దర్యాప్తు చేయించాలని లేఖలో అమిత్ షాను నారాయణ కోరారు.


Next Story