CRPF: ప్రమాదానికి గురైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వాహనం..

CRPF:  ప్రమాదానికి గురైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వాహనం..

జమ్ము కశ్మీర్‌ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్‌ జిల్లా కద్వా బసంత్‌గఢ్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. సుమారు 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఉదంపూర్‌ అడిషనల్‌ ఎస్పీ సందీప్‌ భట్‌ తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నట్లు చెప్పారు.

Next Story