11 కార్లు, 27 బైకులు స్వాధీనం

11 కార్లు, 27 బైకులు స్వాధీనం


హైదరాబాద్‌లో చోరీ వాహనాలు విక్రయిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో పది మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర తనిఖీల్లో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ తర్వాత 11కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలన్నీ పుణె, ఢిల్లీ, హర్యానాలో చోరీ చేసినట్టుగా నిర్ధారించారు. ఒరిజినల్ నెంబర్ ప్లేట్లతో పాటు చేసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు.

Next Story