Japan: జపాన్‌లో భారీ హిమపాతం.. 35 మంది మృతి

Japan: జపాన్‌లో భారీ హిమపాతం.. 35 మంది మృతి

ఉత్తర జపాన్‌లోని దాదాపు 15 ప్రాంతాలను రెండు వారాలుగా భారీ హిమపాతం ముంచెత్తుతోంది. మంచు ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఇంటిపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో కిందికి జారిపడటం, హఠాత్తుగా గుండెపోటుకు గురవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొన్నారు. సుమారు 2 మీటర్ల మేర మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రైళ్లు, రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. 1,700కు పైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు చెప్పారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Next Story