
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వస్తానని, భూదందాల బాధితులను నుంచి ఆర్జీలు స్వీకరించి, వాటిని స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే తెలిస్తే కూటమి నేతలైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన పారదర్శకంగా, నిష్ఫక్షపాతంగా సాగుతోందని, దానికి అలానే కంటిన్యూ చేసేలా నేతలు వ్యవహరించాలన్నారు. ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో 10వేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ చీరలను పంపిణీ చేశారు. తనను ఆదరించి గెలిపించినందుకు కుటుంబానికి పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com