గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేస్తాం : ధూళిపాళ్ల నరేంద్ర

గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేస్తాం : ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో DVC హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ జగదీష్‌కుమార్, గుంటూరు స్టార్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవికుమార్, డాక్టర్ శైలజతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. DVC హాస్పిటల్ వైద్య సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేయనున్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. పల్లె ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ధ్యేయమన్నారు.

Next Story