Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం.

ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శక్తివంతమైన భూ ప్రకంపనల వల్ల వందలాది మంది మరణించారు. భవనాలు కూలిపోయాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. గత కొన్ని సంవత్సరాలుగా భూకంపాలకు నిలయమైన ఈ ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ ప్రకంపనల ల్ల 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది. ఈ ఘటనలో తొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

Next Story