దళితబంధును పేద దళితులకే ఇవ్వాలి

దళితబంధును పేద దళితులకే ఇవ్వాలి

దళితబంధును అందరికీ కాకుండా...పేద దళితులకే ఇవ్వాలని ఈటల కోరారు. రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. తెలంగాణ ఏర్పాటు- తొమ్మిదేళ్ల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో భారీగా వరదలొచ్చాయని... పంటలు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. విద్యారంగాన్ని పటిష్టపరచాలన్నారు. అన్ని ప్రభుత్వ హైస్కూళ్లకు హాస్టళ్లను అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఉన్నా...ఎక్విప్‌మెంట్‌ లేదన్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలను సమకూర్చాలన్నారు.

Next Story