AP: విద్యుత్‌ ఛార్జీల పెంపు, వామపక్షాల ఆందోళన

AP: విద్యుత్‌ ఛార్జీల పెంపు, వామపక్షాల ఆందోళన

ఏపీలొ విద్యుత్‌ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు జరుగుతున్నాయి. విజయవాడలో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగిన ధర్నా నిర్వహించాయి. సీఎం జగన్‌ సామాన్యుల పొట్ట కొట్టి కార్పొరేట్‌ల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు సీపీఎం నేత బాబురావు. ట్రూఅప్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మోదీ కనుసన్నల్లో జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Next Story