నకిలీ మహిళా కానిస్టేబుల్‌ గుట్టు రట్టు

నకిలీ మహిళా కానిస్టేబుల్‌ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో ఓ నకిలీ మహిళా కానిస్టేబుల్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్‌ ఐడీ కార్డ్ తో పోలీసుగా చెలామణి అవుతున్న అశ్విని అనే మహిళను ఆదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌ వరకు చదివి జల్సాలకు అలవాటు పడ్డ ఆమె ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు ఫేక్‌ ఐడీ కార్డ్ సృష్టించింది. ఇక ముగ్గురు యువకులను ప్రేమించిన అశ్విని వారిని చోరీలకు ఉసిగొల్పింది. అంతే కాదు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేసింది. లేటెస్ట్ గా అభిషేక్‌ అనే యువకుడిని ట్రాప్‌ చేసిన అశ్విని తనను పెళ్లి చేసుకోవడం లేదని ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు ఫేక్‌ కానిస్టేబుల్‌ గుట్టు రట్టు చేశారు.

Next Story