ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేసి ప్రాణాలు విడాచారు

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేసి ప్రాణాలు విడాచారు

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గోరవల్లిలో విషాదం జరిగింది. అప్పులభారంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. గోరవల్లిలో సత్తిబాబు కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సత్తిబాబు కుమారుడు సంతోష్‌ కొద్దికాలంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. బాకీ వసూళ్ల కోసం సంతోష్‌ బైక్‌ను తీసుకెళ్లారు. అవమానంగా భావించిన సత్తిబాబు, ఆయన భార్య, కుమార్తె పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తల్లి, తండ్రి మృతి చెందగా నీలిమ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Next Story