TG: ఫిబ్రవరి 4న "సోషల్ జస్టిస్ డే"

TG: ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే

తెలంగాణలో ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక కులగణన సర్వేకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం.. చరిత్రలోనూ కీలక ఘట్టమని సీఎం అన్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కులగణనపై తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణన సర్వేలో పాల్గొనలేని కేటీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.

Next Story