సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికాబజార్‌లోని ధమాకా సేల్ బట్టల షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story