చంద్రయాన్‌-3 తీసిన చంద్రుడి వీడియో విడుదల

చంద్రయాన్‌-3 తీసిన చంద్రుడి వీడియో విడుదల

చంద్రయాన్‌-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. గుంతలు గుంతలుగా ఉన్న చంద్రమామ ఉపరితలం అందులో కనిపించింది. ఇక చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. మళ్లీ ఇలాంటి విన్యాసాన్ని ఎల్లుండి నిర్వహించనున్నారు.

Next Story