
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త దేవీసింగ్ షెకావత్ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు.ప్రతిభాపాటిల్.. 1962లో మహారాష్ట్రలోని జాల్‌గావ్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 వరకు వరుసగా నాలుగుసార్లు ఎద్లాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1985 నుంచి 90 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1991 సాధారణ ఎన్నికల్లో అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com