ముదురుతున్న ఫ్రీ కరెంట్‌ వార్‌..!

ముదురుతున్న ఫ్రీ కరెంట్‌ వార్‌..!

తెలంగాణలో ఫ్రీ కరెంట్‌ వార్‌ ముదురుతోంది. మంత్రి హరీష్‌రావు రెఫరెండాన్ని పీసీసీ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. దమ్ముంటే సబ్‌ స్టేషన్ల దగ్గరకు రావాలన్నారు. 3వేల 500 సబ్‌ స్టేషన్లలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రతి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర రెఫరెండానికి సిద్ధమని స్పష్టం చేశారు. అసెంబ్లీన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని.. కేసీఆర్‌కు దమ్ముంటే గజ్వేల్‌ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

Next Story