YUVAGALAM SABHA: జన ప్రభంజనం

YUVAGALAM SABHA: జన ప్రభంజనం

యువగళం - నవశకం విజయోత్సవ సభకు జనం పోటెత్తడంతో పోలిపల్లి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి నలుదిక్కులా, కనుచూపుమేర ఎటుచూసినా జనమే కనిపించారు.


తెలుగుదేశం, జనసేనకు చెందిన వందలాది మంది నాయకులు...., లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు... సమరోత్సాహంతో సభకు తరలివచ్చారు.


చంద్రబాబు, పవన్ తో పాటు... నందమూరి బాలకృష్ణ, ఇతర ముఖ్యనేతలు సభా వేదికపై రాగానే.. ఇరుపార్టీల కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.


అటు విశాఖ నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారి మొత్తం పసుపుమయంగా మారింది. తమ అభిమాన నేతల రాకను స్వాగతిస్తూ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కటౌట్లు కనిపించాయి.Next Story