
By - Chitralekha |29 May 2023 5:17 PM IST
షార్ నుంచి మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. GSLV-F12 వాహకనౌక NVS-01 ఉపగ్రహాన్ని తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. GSLV-F12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. నావిక్ ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది. 2వేల 232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com