
గుంటూరులో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నల్లమడ రైతు సంఘం నేతల రిలే దీక్షలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మహిళలపై ఉక్కుపాదం మోపారు. వృద్ధురాలు, మహిళలని చూడకుండా పోలీసుల కర్కశత్వం ప్రదర్శించారు. తీవ్రంగా అడ్డుకున్నా వదల్లేదు. కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసుల తీరుపై మహిళలు, నల్లమడ రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
అంతకుముందు.. ఛానల్ పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు రైతులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా రైతులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు పోలీసుల తీరుపై నల్లమడ రైతు సంఘాల నాయకులు, రైతులు తీవ్రంగా మండిపడ్డారు. గత 20 రోజులుగా దశలవారీగా ఆందోళన చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని.. ఛానల్ పొడగించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని రైతులు తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com