లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్. ఈ సంఖ్య చేరుకున్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అసలు ఫలితాలు అక్టోబర్ 08న వెలువడనున్నాయి.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌కు 55, బీజేపీకి 26, ఐఎన్ఎల్డీ 2-3, బీజేపీకి ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. సట్టా బజార్ సర్వేలో కాంగ్రెస్ 50, బీజేపీ 25 సీట్లు వస్తాయని.. ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో బీజేపీకి 78, కాంగ్రెస్ 8కి వస్తాయని తెలిపింది. న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వేలో బీజేపీ-75, కాంగ్రెస్-10 వస్తాయని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com