పెద్దపల్లి జిల్లాలో దంచికొడుతున్న వానలు

పెద్దపల్లి జిల్లాలో దంచికొడుతున్న వానలు

పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో గోపాల్ పూర్ ఇసుక క్వారీలో 15 మంది చిక్కుకున్నారు. అయితే ప్రవాహం క్రమక్రమంగా పెరగడంతో వీరిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మరోవైపు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కంటైనర్‌తో పాటు జేసీబీ సైతం వరదల్లోనే చిక్కుకుపోయింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

Next Story