తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురువనున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సిద్ధిపేట జిల్లా చేర్యాల, దూల్మిట్ట, కొమురవెళ్లి మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద బ్రిడ్జ్‌పై నుంచి మోహి తుమ్మెద వాగు ప్రవహిస్తోంది. దీంతో వరంగల్- సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story