Helicopter crash: కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

Helicopter crash: కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . ఓ హెలికాఫ్టర్‌ కుప్పకూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కిలిమంజారో పర్వతంపై ఉన్న బరాఫు క్యాంపు సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని టాంజానియా పౌర విమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్‌, టూరిస్ట్‌ గైడ్‌, పైలట్‌ ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఆ పర్యాటకులు ఏ దేశానికి చెందినవారనే వివరాలను మాత్రం తెలపలేదు. ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

Next Story