Hyderabad: భారీ వర్షాలకు అధ్వాన్నంగా మారిన రోడ్లు

Hyderabad: భారీ వర్షాలకు అధ్వాన్నంగా మారిన రోడ్లు

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. వర్షం ప్రభావంతో గతుకులతో పాటు, కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. నాలాల కోసం జీహెచ్‌ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగు నీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. నాగోల్, సరూర్‌నగర్‌, యూసఫ్‌గూడ, బోరబండ, కృష్ణానగర్, గాజుల రామారం, కూకట్‌పల్లి సహా శివారు మున్సిపాలిటీల్లోని రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయి. నాసిరకం రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story