
ప్రాణాంతక వైరస్‌గా డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ప్రకటించిన మంకీపాక్స్ క్లేడ్-1బీ రకం వైరస్ భారత్‌లో ప్రవేశించింది. కేరళలో మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏండ్ల వ్యక్తికి గతవారం ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి మ నీశ్ వర్మ సోమవారం మీడియాకు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని గతవారం కేరళ ప్రభుత్వం మంకీపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించి, ఐసోలేషలో ఉంచింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటివరకు 30 ఎంపాక్స్ కేసులు వెలుగులోకి రాగా, అవన్నీ క్లేడ్-2 రకానికి చెందినవిగా వైద్య పరీక్షలో తేలింది. డబ్ల్యూహెచ్‌వో 2022 నుండి మంకీపాక్స్‌ను ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించినప్పటి నుండి భారతదేశంలో 30 కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేరిన మంకీపాక్స్ రోగి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com