
By - jyotsna |17 Oct 2024 1:34 PM IST
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్ బాట పట్టడంతో 46 పరుగులకే టీమ్ ఇండియా అలౌట్ అయింది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు (జైస్వాల్ - 12, పంత్ - 20) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్ సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com