Hyderabad: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

Hyderabad:  కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా షా నవాజ్ నివాసంలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో షా నవాజ్ దుబాయ్‌కి వెళ్లిపోయారు. గతంలోనూ ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుతున్నారన్న సమాచారం అందడంతో ఫలక్‌నామలోనీ కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. షా నవాజ్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్, ఆఫీస్,హోటల్స్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రెండు సార్లు షానవాజ్‌పై ఐటీ దాడులు జరిగాయి.

Next Story