
సొంత సైన్యమైన వాలంటీర్ల వల్లే 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఏపీలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్ అవి వాలంటీర్ల వల్లే అందరికీ చేరువ అవుతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంపురంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిరంగిపురం ఊరిబయటే బారికేడ్లు పెట్టి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులతో పాటు, బస్సులు, లారీలు నిలిచిపోయాయి. గ్రామానికి బయటి నుంచి వచ్చే స్థానికులనూ అనుమతించకపోవడంతో మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే అంబాసిడర్లనీ లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనని వాలంటీర్లు నిరూపించారని ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com