తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో ఉద్రిక్తత

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో ఉద్రిక్తత

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసైనికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలను బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో జనసైనికులకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్చింది వైసీపీ నాయకులే అని ఆరోపించారు. దొంగ ఓట్లు ప్రతిపక్షాల నిరాధారమైన ఆరోపణలన్న మంత్రులు రోజా, పెద్దిరెడ్డి వ్యాఖ్యాలకు ఏం సమాధానం చెబుతారని జనసైనికులు ప్రశ్నించారు.

Next Story