MEET: నారా బ్రాహ్మణిని కలిసిన జనసేన నేతలు

MEET: నారా బ్రాహ్మణిని కలిసిన జనసేన నేతలు

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తాయని జనసేన నేత కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు.


అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్‌, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా పనిచేస్తామని నేతలు వెల్లడించారు.

Next Story