Jharkhand: ఏనుగు బీభ‌త్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమ‌ర్జెన్సీ

Jharkhand: ఏనుగు బీభ‌త్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమ‌ర్జెన్సీ

జార్ఖండ్‌ లో ఓ ఏనుగు బీభ‌త్సం సృష్టించింది. సుమారు 22 మందిని చంపింది. రోజుకు 30 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తోంది. గుంపు నుంచి వేరుప‌డిన ఆ ఏనుగు మ‌హాభీక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తోంది. ప‌శ్చిమ సింగ‌భుమ్ జిల్లాలో ఆ ఏనుగు బీభ‌త్సం సృష్టిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఆ జంతువును ప‌ట్టుకునేందుకు అట‌వీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ ఏనుగుకు మ‌త్తు మందు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ దాన్ని అదుపు చేయ‌లేక‌పోయారు. బ‌హుశా ఆ ఏనుడు మ‌దంతో ప్ర‌వ‌ర్తించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. టెస్టెస్ట‌రోన్ లెవ‌ల్స్ పెర‌గ‌డం వ‌ల్ల ఆ ఏనుగు ప్ర‌మాద‌క‌రంగా మారిన‌ట్లు కూడా అంచ‌నా వేస్తున్నారు. మొదటిసారి ఓ మ‌గ ఏనుగు ఈ స్థాయి బీభ‌త్సం సృష్టించి ఉంటుంద‌ని ఫారెస్ట్ ఆఫీస‌ర్ కుల్దీప్ మీనా తెలిపారు.

Next Story