ఎల్లెంపల్లికి భారీగా వరద నీరు

ఎల్లెంపల్లికి భారీగా వరద నీరు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్లెంపల్లి ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువనున్న కడెం ప్రాజెక్ట్ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1.5 అడుగుల మేర 48 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు. బ్యాక్‌ వాటర్‌ వచ్చే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్ జారీ చేశారు.

Next Story