Kash Patel : భగవద్గీత సాక్షిగా కాష్‌ పటేల్‌ప్రమాణం

Kash Patel : భగవద్గీత సాక్షిగా కాష్‌ పటేల్‌ప్రమాణం

భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్‌ డైరెక్టర్‌ కావటం ఇదే మొదటిసారి. దేశ అత్యున్నత సంస్థకు నేతృత్వం వహించటం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ కాష్‌ పటేల్‌ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ, ‘ఎఫ్‌బీఐకి ఉత్తమ డైరెక్టర్‌ అవుతారు. ఏజెంట్స్‌ ఇష్టపడే వ్యక్తి అవుతాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్‌లోని 1000 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లను బదిలీ చేయాలని కాష్‌ పటేల్‌ ఆదేశించినట్టు సమాచారం.

Next Story