
భారాస అధినేత KCR యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి కేటీఆర్, హరీశ్ రావు తీసుకెళ్లారు. 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జారీపడిన కేసీఆర్.... వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్... కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రతి రోజు యశోదా నుంచి వైద్యులు... కేసీఆర్ కు ఫిజియోథెరపీ చేయడానికి నందినగర్ లోని తమ నివాసానికి వెళ్లనున్నారు. . వారం రోజుల తరువాత మరో మారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని రివ్యూ చేస్తారు.
ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్‌ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com