కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ; గజ్వేల్‌, కామారెడ్డి స్ధానాల్లో బరిలోకి దిగే అవకాశం

కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ;  గజ్వేల్‌, కామారెడ్డి స్ధానాల్లో బరిలోకి దిగే అవకాశం

ప్రత్యర్థులకు అంచనాలకు అందకుండా అభ్యర్థుల అనూహ్య మార్పులు చేర్పుల ప్రయోగాలు కూడా చేస్తుంటారు గులాబీ బాస్. ఇందులో భాగంగానే ఈ సారి ఆయన కామారెడ్డి పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.కామారెడ్డి నియోజకవర్గంతో కేసీఆర్ కు చాలా అనుబంధం ఉంది.ఈ జిల్లాలోని బీబీ పేట్ మండలం కొనాపూర్ లో జన్మించారు కేసీఆర్.కామారెడ్డి నియోజక వర్గంలో కేసీఆర్ పూర్వీకుల మూలాలు ఉన్నాయి.పైగా గంప గోవర్ధన్‌ పై కామారెడ్డిలో వ్యతిరేకత రావడంతో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారని సమాచారం.

Next Story