అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించిన ఖర్గే

అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించిన ఖర్గే

కాంగ్రెస్‌ ఎస్సీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే. బెంగళూరు బయలుదేరిన ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పార్టీ ముఖ్యనేతలకు..పలు సూచనలు చేశారు.మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్‌ను..బలంగా రూపొందించాలని అన్నారు.ఖర్గేను కలిసేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కాంగ్రెస్‌ నేతలు క్యూ కట్టారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సూచించారు ఖర్గే. త్వరలో తెలంగాణకు రాహుల్‌ లేదా ప్రియాంక రానున్నారని, అవసరమైతే మరోసారి రాష్ట్రానికి వస్తానని కాంగ్రెస్‌ నేతలకు తెలిపారు.

Next Story