జలకళను సంతరించుకున్న కిన్నెరసాని ప్రాజెక్టు

జలకళను సంతరించుకున్న కిన్నెరసాని ప్రాజెక్టు

కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఆళ్లపల్లి, గుండాల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్యులకు చేరింది. వరద ఉద్ధృతి మరింత పెరిగితే కిన్నెరసాని డ్యాం అధికారులు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story