
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘భారాసకు వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com