సీఎం జగన్‌ చిత్రపటానికి రిజిస్ట్రార్ పాలాభిషేకం

సీఎం జగన్‌ చిత్రపటానికి రిజిస్ట్రార్ పాలాభిషేకం

స్వామి భక్తిని చాటుకున్నారు ద్రవిడ యూనివర్సిటి అధికారులు.పదవి విరమణ కాలపరిమితి 65 ఏళ్ల పెంచడంతో ఉన్నతాధికారుల అత్యుత్సాహం చూపించారు. ఏకంగా సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రిజిష్టార్‌ వేణుగోపాల్‌ రెడ్డి.కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారులు సీఎం నామస్మరణ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Next Story