Krishna: గుడివాడలో పెరిగిపోతున్న భూకబ్జాలు

Krishna: గుడివాడలో పెరిగిపోతున్న భూకబ్జాలు

కృష్ణా జిల్లా గుడివాడలో బైపాస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఎకరంన్నర భూమిని అధికార పార్టీ నేత ఈడుపుగంటి హరి భగవాన్ కబ్జా చేశారని బాధిత రైతు కుటుంబం మీడియా ముందుకొచ్చి గోడు వెళ్లబోసుకుంది. తమ వద్ద 33 సెంట్ల భూమిని కొన్న వైసీపీ నేత కొన్న భూమిలో కాకుండా తమ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని రైతు పార్థసారథి కుమారుడు నీలాకాంత్ ఆరోపించారు. అంతేకాక అధికారబలంతో తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story