తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా

తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా

తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా కొనసాగుతోంది. కలెక్టర్లు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగుతోంది. మండలాలు, దుకాణాల ప్రాతిపదికన బహిరంగంగా డ్రా తీస్తున్నారు. మొత్తం 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో వచ్చిన పేర్లు వెంటనే అధికారులు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని రాణా ప్రతాప్ ఫంక్షన్‌ హాల్‌లో లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ హజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Next Story