
ముఖ్యమంత్రి జగన్ మాటలను నిశితంగా పరిశీలిస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విమర్శించారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయని, పనులు గడప దాటవని లోకేశ్ పేర్కొన్నారు. సొంత ఇలాకా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేస్తానని చెప్పి శిలాఫలకం వేసి ఇప్పటికి నాలుగేళ్లైందని లోకేశ్ గుర్తుచేశారు. 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టే స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాతికవేలమందికి ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారన్న లోకేశ్ .... కనీసం తుప్పలు తొలగించేందుకు నిధులు కేటాయించక. లిబర్టీ స్టీల్స్ పారిపోయిందని ధ్వజమెత్తారు. తర్వాత JSW సంస్థను బతిమాలి మరోసారి భూమిపూజ చేసినా అదీ కార్యరూపు దాల్చలేదని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వనందున కంకర వేసి తారువేయకుండా కాంట్రాక్టర్ పారిపోయారని లోకేశ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com