నూజివీడు నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర

నూజివీడు నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం మరో మైలురాయికి చేరుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో 195వ రోజు ప్రారంభమైన పాదయాత్ర... ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ శిలాఫలకాలను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.

Next Story