
By - Bhoopathi |13 July 2023 2:00 PM IST
ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. పండగలొస్తే ఈ చీరల ధరలు భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో వస్త్రదుకాణంలో విక్రయిస్తున్న 21 లక్షల రూపాయల చీర చూస్తే ఏకంగా మతులే పోతాయి. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి తెలిపారు. దీని తయారీకి రెండేళ్లు పట్టిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com