
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు.
పూణేలోని నవాలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఐదు నుండి ఆరు వాహనాలను ఢీకొట్టిందని సమాచారం. బలంగా ఢీకొట్టడంతో వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక విభాగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


