రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని హారతిరెడ్డి సూసైడ్‌ చేసుకుంది.భర్త సంతోష్‌రెడ్డి తోపాటు అత్తమామల వేధింపులతోనే..హారతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు.సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు హారతి భర్త సంతోష్‌.అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై హత్య కేసు నమోదు చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

Next Story