మెదక్‌ నుంచే BRSపై యుద్ధం : ఈటల

మెదక్‌ నుంచే BRSపై యుద్ధం : ఈటల

కేసీఆర్‌ జూటా మాటలు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణలో సంపదకు కొదలేదన్నారు... అయితే సంపద ఎటుపోయిందో కేసీఆర్‌ చెప్పాలన్నారు. మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో...డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం చేసిన ధర్నా, ర్యాలీలో....ఆయన పాల్గొన్నారు. మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలు పెడుతున్నట్టు ఈటల ప్రకటించారు. మూడు లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి.... కేవలం లక్ష మాత్రమే నిర్మించారని అన్నారు. నిజాంపేట్‌ జెడ్పీటీసీ విజయ్‌కుమార్‌ ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.

Next Story