బుర్రా మధుసూదన్‌ను అడ్డుకున్న మెట్లవారిపల్లె గ్రామస్తులు

బుర్రా మధుసూదన్‌ను అడ్డుకున్న మెట్లవారిపల్లె గ్రామస్తులు

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు చుక్కలు చూపించారు జనం.ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తమతో ఓట్లు వేయించుకున్నారని... నాలుగేళ్ళ తర్వాత తాము గుర్తొచ్చామా అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు మెట్లవారిపల్లె గ్రామస్తులు. తాము ఉన్నామో.. పోయామో చూడటానికి వచ్చారా అంటూ నిలదీశారు, రోడ్లు వేస్తామని,తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చారని..కానీ గత నాలుగేళ్ళలో ఇవేమీ చేయలేదని ఆరోపించారు.ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తమ గ్రామానికి వచ్చావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో అప్పటికప్పుడే గడపగడప కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు.

Next Story